
గర్జించిన మున్సిపల్ కార్మికులు
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు నెక్కండి సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమ సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని కార్మికులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్మికుల వేతనాల చెల్లింపు, పనుల అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రతపై మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యత ఉండాలన్నారు. వీటిని ప్రైవేట్ కంపెనీ, ఏజెన్సీలకు అప్పగించరాదన్నారు. భీమవరం పట్టణ అధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే అందించాలని కోరారు. వైవీ ఆనంద్, కె.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment