
2,18,997 ఓట్లు.. 17 రౌండ్లు
ఆటో బోల్తా
నూజివీడులోని రామాయమ్మరావుపేట వద్ద ఆటో బోల్తా పడిన సంఘటనలో నలుగురికి తీవ్రంగా, 14 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. 8లో u
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,997 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓట్లను లెక్కించేందుకు 17 రౌండ్లల్లో 28 టేబుళ్లు ఏర్పాటుచేశారు. మొదటి 8 రౌండ్లల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం, అంతకు ముందే చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసే పనిలో కౌంటింగ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోమ వారం ఉదయం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఏలూరు ఎస్పీ కె.ప్రతాప శివ కిషోర్‌లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. కూటమి పార్టీల మద్దతుతో టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా రిటైర్డ్ టీచర్ దిడ్ల వీరరాఘవులతో పాటు 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది. భారీ పోలీస్ బందోబస్తు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు.
ప్రాధాన్యతా క్రమంలో..
28 టేబుళ్లకు సగటున 10 నుంచి 15 వేల ఓట్లను కేటాయించి వాటిలో చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి అలాగే మొదటి ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను వేరు చేసి లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్‌లో 10,783, రెండో రౌండ్‌లో 13,929, 3వ రౌండ్‌లో 11,870, 4వ రౌండ్‌లో 13,777, 5వ రౌండ్‌లో 13,168, 6వ రౌండ్‌లో 14,783, 7వ రౌండ్‌లో 12,841, 8వ రౌండ్‌లో 14,296, 9వ రౌండ్‌లో 14,162, 10వ రౌండ్‌లో 11,654, 11వ రౌండ్‌లో 13,674, 12వ రౌండ్‌లో 12,296, 13వ రౌండ్‌లో 12,523, 14వ రౌండ్‌లో 13,876, 15వ రౌండ్‌లో 14,668, 16వ రౌండ్‌లో 15,823, 17వ రౌండ్‌లో 4879 మొత్తం కలిపి 2,18,997 ఓట్లను లెక్కించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment