మహాశివరాత్రికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
డీఆర్వో వెంకటేశ్వర్లు
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఈనెల 26న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఏఎస్పీ వి.భీమారావు అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లా లోని పాలకొల్లు, భీమవరం, నత్తారామేశ్వరం, జుత్తిగ, ఆచంట, పెనుగొండ, లక్షణేశ్వరం, య నమదుర్రు, శివదేవునిచిక్కాల ఆలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా ఏఎస్పీ వి.భీమారావు మాట్లాడుతూ భీమవరం మావుళ్లమ్మ ఉత్సవాల మాదిరిగా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఆధునిక టెక్నాలజీ సీసీ, సోలార్, డ్రోన్ కెమెరాలను వినియోగించాలన్నారు. బందోబస్తుకు సచివాలయాల్లోని మహిళా పోలీసులను వినియోగిస్తామన్నారు. అక్రమ మద్యం, మత్తు పదార్థాలు, జుదం జరగకుండా చూడాలన్నారు. జిల్లా ఎండోమెంట్ అధి కారి ఈవీ సుబ్బారావు, జిల్లా అగ్నిమాపకదళ అధికారి బి.శ్రీనివాసరావు, ఆర్‌బీఎస్ కేపీఓ సీహెచ్ భావన, కో–ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.సన్యాసిరావు, డిప్యూటీ తహసీల్దార్ ఈ.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment