
బలివే ఉత్సవాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం
బలివే(ముసునూరు) : భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో బలివే మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ అన్నారు. బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉత్సవాల నోడల్ అధికారి, తహసీల్దార్ కె.రాజ్‌కుమార్ అధ్యక్షతన సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పంచాయతీరాజ్, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో భక్తుల స్నానాలు, దైవ దర్శనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నూజివీడు, ఏలూరు రహదారుల మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవ ప్రాంగణ పరిసరాల్లో మద్యం విక్రయాలు లేకుండా ఆ శాఖలను అప్రమత్తం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment