వేగంగా మౌలిక వసతుల కల్పన
భీమవరం(ప్రకాశంచౌక్): ఎస్సీ బాలికల వసతి గృహంలో టాయిలెట్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, గడువులోపు పను లు పూర్తికాకుంటే చెల్లింపులు నిలిపివేస్తారని కలెక్టర్ చదలవాడ నాగరాణి కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. పట్టణంలోని ఎస్సీ బాలికలు, ఎస్టీ బాలుర హాస్టళ్లలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రైతు బజార్ సమీపంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎస్సీ కాలేజీ విద్యార్థుల వసతి గృహం, ఎస్సీ చిన్నపిల్లల వసతి గృహం, బీసీ విద్యార్థుల వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. హాస్టళ్లలో వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ కేటాయించామని పనులు సకాలంలో పూర్తికావాలన్నా రు. విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, ఇన్వర్టర్ కోసం విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. అనంతరం గునుపూడి ఎస్టీ బాలుర హాస్టల్‌ను ఆమె పరిశీలించారు. భోజనం నాణ్యతపై ఆరా తీశారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ వై.హరిహరనాథ్, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి బి.రామాంజనేయరాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment