పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2,800
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు కోసం ఫారం–12 సమర్పణకు గురువారం తుది గడువుగా విధించారు. ఈ క్రమంలో ఆరు జిల్లాల్లో కలిపి కేవలం 220 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు మాత్రమే అందాయి. మొత్తంగా 440 పోలింగ్ కేంద్రాల్లో సుమారు పోలీస్ సిబ్బందితో సహా 2,800 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలీస్ శాఖ, ఇతర ప్రధాన విభాగాల నుంచి మరికొందరి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు రావాల్సి ఉంది.
3.15 లక్షల మంది ఓటర్లు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3,15,261 మంది ఈనెల 27న ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కూటమి పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్ధి దిడ్ల వీరరాఘవులుతో పాటు 33 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 25న సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ ఇలా ఐదుగురు ఉద్యోగులను నియమించారు. అలాగే ప్రతి చోటా ఇద్దరు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 62, పశ్చిమగోదావరిలో 93, తూర్పుగోదావరిలో 82, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 92, కాకినాడ జిల్లాలో 96, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల విధుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్‌కు దర ఖాస్తు చేసుకోవాలి.
40 శాతం స్లిప్పుల పంపిణీ
పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం–12 దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్‌ను ఏలూరు కలెక్టరేట్ నుంచి రిజిస్టర్ పోస్టు చేయనున్నారు. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న క్రమంలో 2న సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించే అవకాశం కల్పించారు. మరోవైపు ఆరు జిల్లాల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 40 శాతం స్లిప్పల పంపిణీ పూర్తయింది.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పా ల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జేసీ పి.ధాత్రిరెడ్డి తెలి పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం పోస్టల్ బ్యా లెట్ పత్రాల పంపిణీని ఆమె పరిశీలించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ స్లిప్పుల పంపిణీ
రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల జారీ ప్రక్రియ
ఆరు జిల్లాల్లో 440 పోలింగ్ కేంద్రాలు
27న పోలింగ్.. 3న కౌంటింగ్
Comments
Please login to add a commentAdd a comment