బయో సెక్యూరిటీ విధానాన్ని పాటించాలి
తణుకు అర్బన్: కోళ్ల ఫారాల్లో పూర్తిస్థాయి బయోసెక్యూరిటీ విధానాన్ని పాటిస్తే బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగా కోళ్ల ఉత్పత్తులపై విధించిన నిబంధనలను త్వరగా తొలగించే పరిస్థితి ఉంటుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్‌జీ బొంబేలే అన్నారు. గురువారం తణుకు చిట్టూరి హెరిటేజ్‌లో పౌల్ట్రీ రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్‌జోన్ ప్రాంతాన్ని గతంలో 3 కిలోమీటర్ల పరిధి నిబంధన ఉండేదని రైతుల ఇబ్బందుల దృష్ట్యా కిలోమీటరుకు తగ్గించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఫారాల్లోని కోళ్లకు వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ చేపట్టనున్నామన్నా రు. నెక్ చైర్మన్ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ వైరస్ కన్నా ప్రభుత్వం విధించిన నిబంధనలపై మీడియా చేసిన ప్రచారం కారణంగా ప్రజల్లో అపోహలు పెరిగిపోయి పౌల్ట్రీ రైతులు నష్టపోయారని అన్నారు. పౌల్ట్రీ రంగం కోళ్ల ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్లు జీఎస్టీ రూపంలో చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు. అనంతరం వేల్పూరు రెడ్‌జో న్‌లోని కోళ్ల ఫారాలను, ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర ఎస్‌ఆర్‌డీడీఎల్ జేడీ డాక్టర్ రవీంద్ర హెడ్గే, ఐసీఏఆర్ సీనియర్ సైంటిస్ట్‌లు ఎండీ మద్సార్ చాంద్, డాక్టర్ మనోజ్‌కుమార్, వెటర్నరీ యూనివర్సిటీ మైక్రో బయోలజీ ప్రొఫెసర్ కేవీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ జేడీ దామోదర్ నాయుడు, జిల్లా జేడీ మురళీకృష్ణ, డీడీ వాకాని ప్రసాద్, తణుకు మండల పశు వైద్యాధికారి శంకర్ భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసీ ఉద్యోగుల నిరసన
తాడేపల్లిగూడెం (టీఓసీ): భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో 3, 4 తరగతుల ఉద్యోగుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని, అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘానికి గు ర్తింపు ఇవ్వాలని కోరుతూ గురువారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద భోజన విరామానికి ముందు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగుల సంఘ కార్యదర్శి సొలస సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల నియామకం, సంఘ గుర్తింపు కోసం మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు తోట పద్మారావు, విద్యాసాగర్, రమేష్, సాయిరాం, జయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment