కొరుటూరులో చిరుత సంచారం
పోలవరం రూరల్: గోదావరి నదీ పరీవాహకంలోని ఏజెన్సీ ప్రాంతంలో వన్య మృగాలు సంచరిస్తున్నాయి. పోలవరం మండలం కొరుటూరు సమీపంలో చిరుత సంచరిస్తోంది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో దీనిని గుర్తించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ఎవరూ సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 గిరిజన గ్రామాలు ఖాళీ అయ్యాయి. దీంతో జనసంచారం ఉండటం లేదు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో నీటి కోసం పలురకాల జంతువులు గోదావరి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. జనసంచారం లేకపోవడంతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment