భీమవరం: మాతా, శిశు సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి లేదని దీనికి కేంద్ర బడ్జెట్ నిదర్శనమని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. వేతనాల పెంపు కోసం, రాజకీయ వేధింపులు ఆపాలని, పని ఒత్తిడి తగ్గించాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు మరోసాఇ ఆందోళనకు సిద్ధం కాక తప్పదని పిలుపునిచ్చారు. పెరిగిన ధరలు, చాలీచాలని వేతనాలు, వివిధరకాల పేర్లతో ఆన్‌లైన్ సేవలప్పగించడం వంటి సమస్యలు అంగన్‌వాడీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment