
పెళ్లి బృందాలను తరలిస్తున్న బస్సుల సీజ్
భీమవరం(ప్రకాశం చౌక్) : పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న మూడు స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు అడ్డుకుని సీజ్ చేసి, జరిమానా విఽధించారు. భీమవరం నుంచి గణపవరం వెళుతున్న రెండు బస్సులు, ఆకివీడు వెళుతున్న ఒక బస్సును సీజ్ చేసి మూడు బస్సులకు కలిపి రూ.1,85,540 జరిమానా విధించినట్టు జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు తెలిపారు. గురజాడ విద్యానికేతన్ (గణపవరం), ఇండియన్ డిజిటల్ స్కూలు(గణపవరం), భారతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ(ఆకివీడు)కు చెందిన బస్సులు సీజ్ చేసినట్లు చెప్పారు. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు స్కూల్ బస్సులను వినియోగించడం చట్ట విరుద్ధమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment