భీమవరం: జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటనకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్‌సుందర్ సోమవారం ఒక ప్రటకనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల రాష్ట్ర పర్యటనకు జిల్లాలోని 82 పాఠశాల ఎంపికచేయగా ఒక్కొకరికి రూ.200 చొప్పున రూ.16,400 కేటాయించిందని, రాష్ట్రేతర పర్యటనకు 82 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి రూ.1.64 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో 20 మంది బాలురు, 40 మంది బాలికలు, 20 మంది టీచర్లు, 125 మంది గైడ్ టీచర్లు, ఏఎంఓ, డీఎస్‌వోతో సహా మొత్తం 207 మంది రాష్ట్ర పర్యటనకు రూ.4.14 లక్షలు, రాష్ట్రేతర పర్యటనకు రూ.4.14 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment