
ఆర్డీఓ కార్యాలయం తనిఖీ
తాడేపల్లిగూడెం: రెవెన్యూ సదస్సులు, రీ సర్వే గ్రామ సభల్లో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను సోమవారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు జేసీ మండలంలోని నవాబుపాలెంలో రీ సర్వే పనులను పరిశీలించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే పనులను నిర్వహించాలన్నారు. గ్రామంలో రికార్డుల ప్రకారం జరుగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సందేహాలు నివృత్తి చేశారు. రీ సర్వేకు సంబంధించి ముందుగా నోటీసులు అందిస్తున్నారా అని రైతులను అడిగారు. ఆర్‌డీఓ, జిల్లా రెవిన్యూ అఽధికారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment