ముగిసిన రోడ్డు భద్రత మాసోత్సవాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 18 ఏళ్లు నిండని వారికి మోటార్ వాహనాలు నడిపే హక్కు లేదని అడిషినల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో శనివారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రహదారి భద్రతా నియమాలు అందరూ పాటించాలన్నారు. హెల్మెట్, సీటు బెల్టు తప్పక ధరించాలన్నారు. మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో 50కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓలు కృష్ణారావు, మదానీ మాట్లాడుతూ రహదారి భద్రత అందరి బాధ్యత అన్నారు. జిల్లాలో ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లు, విద్యాసంస్థల బస్సు డ్రైవర్లను సత్కరించారు. చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఆర్టీసీ డీఎం బి.వాణి, ఆర్‌అండ్‌బీ డీఈ సంఘమిత్ర, రవాణా శాఖ పరిపాలన అధికారులు ఎం.రాము, ఎం. ఆనంద్ కుమార్, వాహన తనిఖీ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment