తాడేపల్లిగూడెం రూరల్: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. పెదతాడేపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి అజయ్‌కుమార్ బాబు (27) ఈ నెల 16వ తేదీన రాత్రి తన తల్లి ఇంటి డాబాపైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి మెట్లపై నుంచి కిందకు పడిపోయాడు. దీంతో అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 17న తాడేపల్లిగూడెం ట్రినిటీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై అజయ్‌కుమార్ బాబు భార్య లావణ్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment