లంచావతార ఉద్యోగి తొలగింపు?
నిడమర్రు: ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అంటూ సాక్షిలో ఈనెల 14న వచ్చిన కథనంపై జిల్లా ఫారెస్టు అధికారులు స్పందించారు. లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నబిగారి శ్రీనివాసబాబును విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. శ్రీనివాసబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారించిన ఏలూరు రేంజ్ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మి రైతులను విచారించారు. అనంతరం నివేదికను జిల్లా ఫారెస్టు అధికారికి సమర్పించారు. నివేదికలోని అంశాలు బహిర్గతం కాకపోయినప్పటికీ అనధికారికంగా అందిన సమాచారం మేరకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న శ్రీనివాసబాబును విధులనుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment