
వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు
పార్టీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు
కై కలూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో ఏలూరు జిల్లాకు చెందిన పలువురి పార్టీ నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు అందాయి. నియామకాల్లో పార్టీ రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీలుగా గంటా సంధ్య, కూసనపూడి కనకదుర్గారాణి (బుజ్జమ్మ), రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీగా సయ్యపురాజు గుర్రాజు, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీగా ఐనాల బ్రహ్మా జీ, రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీలుగా పరసా చిన్నారావు, కిలారపు శ్రీనివాసరావు(బుజ్జి), బలే నాగరాజు, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా కోటగిరి రాజా నాయన, పెద్దిరెడి శ్రీరామ దుర్గాప్రసాద్ ఉన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎంపికైన నాయకులు చెప్పారు. రాష్ట్ర స్థాయి పదవులు అందించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కమిటీలో చింతలపూడి నేతలు
చింతలపూడి: వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా కమిటీలో పార్టీ చింతలపూడి నియోజకవర్గ నాయకులు ఏడుగురు చోటు సంపాదించారు. జిల్లా వైఎస్ ప్రెసిడెంట్‌గా జగ్గవరపు జానకిరెడ్డి, జనరల్ సెక్రటరీగా మోరంపూడి జగన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ముప్పిడి శ్రీను, రాయంకు సత్యనారాయణ, యాక్టివ్ సెక్రటరీగా వామిశెట్టి హరిబాబు, అయినాల వెంకటరమణ మూర్తి, అధికారిక ప్రతినిధిగా రాఘవరాజు ఆదివిష్ణు నియమితులయ్యారు. వీరిని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు, పలువురు అభినందించారు.
ఏలూరు నుంచి రాజేష్
ఏలూరు టౌన్: ఏలూరుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత పాతినవలస రాజేష్ (కరుణ)ను పార్టీ ఏలూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించారు. రాజేష్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పార్టీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ సూచనలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.

వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు

వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు

వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు

వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు

వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు

వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు
Comments
Please login to add a commentAdd a comment