
ప్రాణం తీసిన అతి వేగం
ఒకరు మృతి.. మరొకరికి స్వల్ప గాయాలు
దేవరపల్లి : అతివేగం ఒక యువకుడి ప్రాణం తీసింది. ఆగి ఉన్న వ్యాన్‌ను మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన కల్లూరి విజయ్‌కుమార్ (30), ఏలూరులోని వినాయకనగర్‌కు చెందిన ఏలేటి గోవింద్ వరుసకు బావ, బావమరుదులు. ఇద్దరూ కలసి గురువారం ఉదయం విశాఖపట్టణంలో బంధువుల వివాహానికి బయలుదేరారు. విజయ్‌కుమార్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, గోవింద్ వెనుక కూర్చున్నాడు. దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్దకు వచ్చే సరికి హైవేపై ఆగి ఉన్న ఐషర్ వ్యాన్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొన్నారు. ఈ ఘటనలో విజయ్‌కుమార్ తలకు బలమైన గాయం కాగా చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గోవింద్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నట్టు ఏఎస్సై నాగభూషణం తెలిపారు. విజయ్‌కుమార్‌కు హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకపోవడం వల్ల మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం తీసిన అతి వేగం
Comments
Please login to add a commentAdd a comment