వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
యువత పోరు విజయవంతం చేయాలి
నరసాపురం: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకను బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రపసాదరాజు పార్టీ నేతలకు సూచించారు. ఉదయం నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం రాష్ట్రంలో ఓ చరిత్ర అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో జెండా ఆవిష్కరణల అనంతరం భీమవరంలో జరిగే యువత పోరు అందోళనకు పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని సూచించారు. రాష్ట్రంలో యువత, విద్యార్థులకు మోసపూరిత హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దగా చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment