భీమవరం/ భీమవరం(ప్రకాశం చౌక్): సమస్యల పరిష్కారం కోసం భీమవరం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వస్తున్న బాధితులకు పూర్తిస్థాయిలో పరిష్కారం కానరావడం లేదు. దీంతో అర్జీదారులు మరలా మరలా అవే దరఖాస్తులు అందిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పింఛన్ల మంజూరు, ఇళ్ల స్థలాలు, పింఛన్ పెంపు ఆన్‌లైన్ కోసం ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆయా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పలు గ్రామాల్లో సర్వే సక్రమంగా చేయకపోవడం, కూటమి నాయకుల పెత్తనంతో సరిహద్దు సమస్యలు తీర్చలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకూ 19,659 వినతులు రాగా 17,442 అర్జీలు పరిష్కరించారు. 2,217 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.
కలెక్టరేట్ వద్ద పాట్లు : భీమవరంలో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారికి కలెక్టరేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అలాగే కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్న బాధితులు కూర్చోవడానికి తగి న స్థలం, కుర్చీలు లేకపోవడంతో మెట్లపై, కింద కూర్చుంటున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సోమ వా రం కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివ చ్చారు. 271 మంది వినతిపత్రాలు సమర్పించారు. ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపి కలెక్టర్‌కు వినతులు సమర్పించారు.
అర్జీలకు పూర్తిస్థాయిలో లభించని పరిష్కారం
మరలా మరలా దరఖాస్తుల సమర్పణ
వెల్లువెత్తుతున్న వినతులు
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !