భీమవరం: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 128 కేంద్రాల్లో తెలుగు పరీక్షకు 22,692 మందికి 22,091 మంది హాజరు కాగా 97.35 శాతం హాజరు నమోదైంది. 46 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, నాలుగు కేంద్రాలను జిల్లాస్థాయి పరిశీలకుడు, నాలుగు కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్, డీఈఓ నాలుగు కేంద్రాలు, కలెక్టర్ ఒక కేంద్రంలో తనిఖీలు చేసినట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
లోటుపాట్లు లేకుండా చూడాలి
భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్ కేంద్రాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లే కుండా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థు లకు సమస్యలుంటే కంట్రోల్ రూమ్ 08816– 297200కు ఫోన్ చేయాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ ఆమె వెంట ఉన్నారు.