ఆ చిన్నారుల చదువుకు వీధి లైట్లే దిక్కు | - | Sakshi
Sakshi News home page

ఆ చిన్నారుల చదువుకు వీధి లైట్లే దిక్కు

Mar 23 2025 12:35 AM | Updated on Mar 23 2025 12:34 AM

ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు

పట్టాలిచ్చినా కట్టుకునే స్థోమత లేక అవస్థలు

దయ చూపండని బాఽధితులు, పిల్లల మొర

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆకివీడులోని అమృతరావు కాలనీకి చేర్చి శ్మశాన భూమికి మధ్య ఆక్రమణలను తొ లగించడంతో బాధితులు వీధిన పడ్డారు. వారి పిల్ల లు వీధి దీపాల కింద చదువుకోవాల్సిన దుస్థితి నె లకొంది. 30 ఏళ్లుగా శ్మశానానికి ఆనుకుని పూరి పా కలు, పందిళ్లు వేసుకుని సుమారు 29 కుటుంబాల వారు జీవిస్తున్నారు. ఇటీవల కోర్టు ఆదేశాలతో రెవె న్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. గత ప్రభుత్వంలోనే 22 మంది బాధితులకు పట్టాలు ఇచ్చారు. తమకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదని బా ధితులు ఆక్రమణల నుంచి వైదొలగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్రమణలను ఖాళీ చే యించారు. ఆక్రమణదారులు ఆయా పంచల్లోనే కా లం గడుపుతున్నారు. తాము ఇల్లు నిర్మించుకునే స్థితిలో లేమని చెప్పడంతో ఆయా పట్టాలను వేరొకరికి మార్పు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ప్రభుత్వమే తమకు ఇల్లు నిర్మించి ఇ వ్వాలని కోరుతున్నారు. 30 ఏళ్లుగా వర్షాలు, ముంపు నీటిలోనే జీవనం గడిపామని, పాములు, క్రిమికీటకాలతో పాటు, శవ దహనాల ఎదురుగా భోజ నాలు చేశామని, నిద్రపోయామని వాపోతున్నారు.

వీధి దీపాల కింద చదువులు : 29 బాధిత కుటుంబాల్లో సుమారు వంద మందికి పైగా ఉన్నారు. వా రిలో సుమారు 25 నుంచి 30 మంది వరకు పిల్లలుండగా చాలా మంది ఆరు నుంచి పదో తరగతి చ దువుతున్నవారే. వీరంతా గూడు లేక, చదువుకునేందుకు ఆస్కారం లేక వీధి దీపాల కింద చదువుకుంటూ కాలం గడుపుతున్నారు. ఒక పక్క దోమలు, మరో పక్క ఉక్కబెట్టే వాతావరణంలో అల్లాడిపోతున్నారు. రోడ్లపై పడుకుంటూ, వీధిలైట్ల వెలుగులో చదువుకుంటు న్నా అధికారులకు, పాలకులకు కనికరం లేదని ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకునేందుకు కూ టమి ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశించామని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా పట్టించుకోలేదని పిల్లలు, వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. రెండు మూడు తరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నామని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో తమకు పట్టాలిచ్చారని చెబుతున్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం రూ.4 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో ఆశగా ఎదురు చూశామని, అవి కాస్తా ఆవిరయ్యాయని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా వీధి దీపాల కింద పిల్లలు చదు వు కుంటున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే రఘు రామకృష్ణరాజు స్థానిక పార్టీ నేతలను పంపించి విషయం బయటికి రాకుండా సద్దుమణిచే ప్రయ త్నం చేయడం గమనార్హం

ఆ చిన్నారుల చదువుకు వీధి లైట్లే దిక్కు 1
1/1

ఆ చిన్నారుల చదువుకు వీధి లైట్లే దిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement