
సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు దోహదం
వీరవాసరం : కళలు, కళాకారులు ఎక్కడైతే గౌరవించబడతారో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటక పోటీల సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాటక ప్రదర్శనలు సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి ఎంతో దోహదపడతాయన్నారు. టీవీ రంగం మనిషిని చిన్నగా, సినిమారంగం మనిషిని పెద్దగా చూపిస్తుందని, మనిషిని మనిషిగా ఒక్క నాటక రంగమే చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో నాటక పరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని, అల్లు రామకృష్ణ, గంట ముత్యాల నాయుడు, రామ్మోహన్ రావు, వెంకట రత్నం, పాలా ఆంజనేయులు, కళాపరిషత్ సభ్యులు పాల్గొన్నారు.