తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దని, వాటిని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర సీపీఎం పార్టీ పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని జయలక్ష్మి థియేటర్ సమీపంలోని సౌత్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టి ఏఈకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో మరోసారి ప్రజలపై భారాలు మోపాడాన్ని ఖండించారు. స్మార్ట్‌మీటర్లు బిగించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. నాయకుడు కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ భారాలను మోపితే ప్రశ్నిస్తామని, ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.