పెనుగొండ: భూ సర్వేలు రైతు సమక్షంలో నిర్వహించి వారికి సంతృప్తి కలిగించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెనుగొండ మండలంలో పైలెట్ గ్రామం దేవలో ట్రూతింగ్ పనులు పూర్తి చేసిన అనంతరం హెచ్చుతగ్గులపై రైతులు దరఖాస్తు చేసుకోవడంతో వాటిని పరిశీలించారు. భూయజమానితో మాట్లాడుతూ కొలతల్లో ఎటువంటి పొరపాటు లేదని, రికార్డుల ప్రకారం కచ్చితంగా భూమి ఉందని పిటిషన్‌దారుడు, సరిహద్దుదారుడుకు వివరించారు. అనంతరం వరి చేలను పరిశీలించారు. ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. కోతలు కోసిన త ర్వాత ధాన్యాన్ని రెండు రోజులు ఆరబెట్టి రైతు సే వా కేంద్రాలకు తరలించాలన్నారు. తహసీల్దార్ జి. అనితకుమారి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.