
పాస్టర్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి
అత్తిలి: క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని క్రైస్తవ మత పెద్దలు అన్నారు. అత్తిలి మండల క్రైస్తవలు ఆదివారం అత్తిలిలో ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు. అత్తిలి బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు వినతి పత్రం అందజేశారు. యూపీఎం ప్రెసిడెంట్ బాబూరావు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీని ఉద్దేశించి బిషప్ ప్రేమ్‌కుమార్, బిషప్ జగజ్జీవన్, ఎన్‌సీసీ స్టేట్ సెక్రటరీ మనోజ్‌బాబు, ఎంఆర్‌పీఎస్ అబ్బు దాసరి లాజరస్ మాట్లాడారు.
భీమవరంలో..
భీమవరం: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేస్తూ శత వార్షిక రూపాంతర దేవాలయం సంఘ సభ్యులు ఆదివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. సత్వరం దర్యాప్తు చేసి.. ఆయన మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సభ్యులు కోరారు. పీసీసీ చైర్మన్ ఉన్నమట్ల కరుణాకరరావు, రేమల్లి కమలరాజు, సంఘస్తులు పాల్గొన్నారు. అదే విధంగా పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ స్థానిక లూథరన్ గ్రౌండ్ నుంచి ప్రకాశంచౌక్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం దర్యాప్తును వేగంవంతం చేయాలని డిమాండ్ చేశారు. గంటా సుందర్‌కుమార్, చిగురుపాటి సందీప్, పిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
మండవల్లిలో..
మండవల్లి: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండవల్లిలో మండల క్త్రెస్తవ సంఘాలు, విశ్వాసుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కమ్యూనిటీ హాలు నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేశారు. తొలుత ప్రవీణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాల్వేషన్ ఆర్మీ డీసీ మేజర్ మణిబాబు, సీఎస్‌ఐ ప్యారీస్ గురువు ఎ,సతీష్, సీయోన్ శిఖరం పాస్టర్ గుర్రం పరంజ్యోతి, సీయోను మందిరం మేజర్ పాస్టర్ తిమోతి తదితరులు పాల్గొన్నారు.
ఆకివీడులో..
ఆకివీడు: పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానస్పద మృతికి నిరసనగా ఆదివారం ఆకివీడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీబీసీఎన్‌సీ సెంట్రల్ బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి గూడపాటి జోసఫ్ రాజు మాట్లాడుతూ పాస్టర్లపై దౌర్జన్యాలు, హత్యల్ని ఖండించాలన్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న పాస్టర్లపై దాడులు హేయమైన చర్య అన్నారు. స్థానిక సీబీసీఎన్ చర్చి నుంచి ప్రధాన సెంటరులోని అంబేడ్కర్ సెంటర్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ జార్జి, మండా ఏసోబు, బొండాడ వెంకటేశ్వరరావు, నాని, మద్దా నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురంలో..
నరసాపురం: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యేనని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆదివారం నరసాపురంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ వై.రూబెన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో జిల్లా నలుమూలలు నుంచి వేల సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రైస్తవులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు చదలవాడ జ్ఞానప్రకాష్, కాకిలేటి మధు, అడిదల శరత్, సికిలే పెర్సిపాల్, ఇంజేటి జాన్‌కెనడీ తదితరులు పాల్గొన్నారు.

పాస్టర్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి

పాస్టర్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి

పాస్టర్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి