
మావుళ్లమ్మ ఆలయంలో పంచాంగ శ్రవణం
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలో కొలువైన మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వారణాసి సేతు మాధవలక్ష్మీ నరసింహమూర్తి విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీనగేష్ మాట్లాడుతూ విశ్వావసు ఉగాది శుభ సంవత్సరం కావాలని కోరుతూ అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మవారికి పూజ చేసి పసుపు కొమ్ములు, ఒక నాణెం అందజేసినట్లు తెలిపారు. దేవస్థానం తరపున జ్యోతిష్య వేత్త బ్రహ్మశ్రీ ర్యాలీ కృష్ణ ప్రసాద్ సిద్ధాంతిని సత్కరించినట్లు తెలిపారు. గునుపూడిలో పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్థన స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.