భీమవరం: జిల్లా డిజిటల్ అసిస్టెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గం భీమవరంలో ఏకగ్రీవంగా ఎన్నికై ంది. సోమవారం నిర్వ హించిన ఆత్మీయ సమావేశంలో అధ్యక్షుడిగా ఆలీషా, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, కోశాధికారిగా ఆదిత్య, మహిళా విభాగం కార్యదర్శిగా అనురాధ, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు ఆలీషా మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన 277 డిజిటల్ సహాయకులను గణాంకాల శాఖలో విలీనం చేసేలా రూపొందించిన కమిటీని ప్రభుత్వం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునః పరిశీలన చేసి కమిటీ పునరుద్ధరించాలని కోరారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన వారికి టెక్నికల్ పదోన్నతులు కల్పించాలన్నారు. ఆధార్ సూపర్‌వైజర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభువు మార్గం అనుసరణీయం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏసుక్రీస్తు మార్గంలో ప్రతి క్రైస్తవుడూ పయనించిన నాడే శాంతి, స మాధానాలు లభిస్తాయని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు అన్నారు. స్థానిక గ్జేవియర్ నగర్‌లో ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్, నిర్మలగిరి పుణ్యక్షేత్ర అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కళ్లే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సో మవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడు తూ పొరుగువారిని ప్రేమతో ఆదరించాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అ మలోద్భవి కథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ ఇంజమాల మైఖేల్ మాట్లాడుతూ బిషప్ జయ రావు విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తొలుత కేక్ కట్ చేసి మహోత్సవాన్ని నిర్వహించారు. మేత్రాసనం ప్రొక్యూరేటర్ ఫా దర్ బి.రాజు, నిర్మలగిరి పుణ్యక్షేత్ర విచారణ గురువు జాన్ పీటర్, నాగేశ్వరరావు బిషప్ జ యరావును గజమాలతో సన్మానించారు. కళ్లే ల లిత ట్రస్ట్ చైర్మన్ భక్తుల సౌకర్యార్థం ఏసీ, రెండు వాటర్ రిఫ్రిజిరేటర్లను అందజేశారు.
బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ
ఏలూరు రూరల్: ఏలూరుకు చెందిన భానుప్రకాష్ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ బాడీ బిల్డింగ్‌లో రాణిస్తున్నాడు. ఇటీవల షిరిడీలో ఇండియన్ బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయస్థాయి సీనియర్, జూనియర్ బాడీ బిల్డింగ్ పోటీల్లో 55 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే బాడీ బిల్డింగ్‌పై మక్కువతో ఈ రంగంలో శ్రమిస్తున్నాడు. దాతలు ఆకుల బ్ర దర్స్ ఆర్థిక సాయంతో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 2019 నుంచి ఇప్పటివరకూ జిల్లా, జో నల్, రాష్ట్రస్థాయిలో పలు పతకాలు సాధించాడు. తాజాగా జాతీయ స్థాయిలో సత్తాచాటి అంతర్జాతీయ స్థాయిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
నేడు టెన్త్ సోషల్ పరీక్ష
భీమవరం: ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం సాంఘికశాస్త్రం పరీక్ష జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఈ.నారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నామని డీఈఓ నారాయణ పేర్కొన్నారు.

డిజిటల్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి

బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ

ప్రభువు మార్గం అనుసరణీయం