
ఉపాధి పనులు పారదర్శకంగా జరగాలి
కాళ్ల: కాళ్ల మండలం బొండాడపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కేసీహెచ్ అప్పారావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పశువుల చెరువు పూడికతీత పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి మస్తర్ రికార్డులను పరిశీలించారు. 3,307 పనిదినాలు అంచనాతో రెండు ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో సుమారు రూ.10 లక్షలతో చేపట్టిన పనులు పారదర్శకంగా జరగాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జి.స్వాతి, ఏపీఓ కె.శ్రీనివాసరావు, సర్పంచ్ గుడ్ల మధుసూదనరావు, టెక్నికల్ అసిస్టెంట్ వీవీ మణికంఠ, ఫీల్డ్ అసిస్టెంట్ నాగలక్ష్మి పాల్గొన్నారు.