
ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి
భీమవరం: మున్సిపాలిటీల ద్వారా ప్రజలకు అందించే సేవల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశించిన కార్మికుకు చేదు అనుభవం ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేవలను ప్రైవేటుపరం చేస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు నీలాపు రాజు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ దశల వారిగా ఆందోళనకు పిలుపునిచ్చిందని సంతకాల సేకరణ, ప్రదర్శనలు, మంత్రికి వినతి పత్రం అందించడం వంటి పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి వినతి పత్రం అందజేశారు.