
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8లో u
గళమెత్తిన
ఉపాధ్యాయులు
భీమవరం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలుచేసేలా ప్రభుత్వ విధానాలుండాలని పీఆర్‌సీ గడువు ముగిసి 21 నెలలు గడిచిపోయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం 9 నెలలు గడిచిపోయిన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనాలోనూ సాధారణంగా చనిపోయిన స్థానిక సంస్థల ఉద్యోగ, ఉపాధ్యాయుల వారసులకు గత ఐదేళ్లనుంచి కారుణ్య నియామకాలు లేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాప్టో చైర్మన్ పిఎస్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ జి.ప్రకాశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఎ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్‌సీ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని, సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కో–చెర్మన్స్ పి.సాయి వర్మ, ఎన్.శ్రీనివాసరావు, బీవీ నారాయణ, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.