నాలుగో వసంతంలోకి నవ పశి్చమ | - | Sakshi
Sakshi News home page

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ

Apr 4 2025 12:36 AM | Updated on Apr 4 2025 12:36 AM

నాలుగ

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ

భీమవరం(ప్రకాశం చౌక్‌): ప్రజలకు పాలనను చేరువ చేయడంతో పాటు మరింత మెరుగ్గా అందించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిని ప్రామాణికంగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. దీనిలో భాగంగా 2022 ఏప్రిల్‌ 4న ఏలూరు కేంద్రంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాను రెండుగా విభజించారు. భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లాలు ఏర్పడ్డాయి. శుక్రవారంతో కొత్త జిల్లాలు మూడేళ్లు పూర్తిచేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్నాయి.

తగ్గిన

దూరాభారం

భీమవరం కేంద్రంగా 20 మండలాలతో జిల్లాను ఏర్పాటుచేయడంతో ప్రజలకు పాలన చేరువైంది. జిల్లాలోని ఏ ప్రాంతం వారు అయినా 30 కిలోమీటర్లలోపు జిల్లా కేంద్రానికి సులభంగా చేరుకుంటున్నారు. గతంలో జిల్లా కేంద్రం ఏలూరు వెళ్లేందుకు 70 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడేవారు. భీమవరంలో కలెక్టరేట్‌. జిల్లా అధికారుల కార్యాలయాలు ఏర్పాటుచేయడంతో వీరికి వ్యయప్రయాసలు తప్పాయి. ముఖ్యంగా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే మీకోసం కార్యక్రమానికి సులువుగా హాజరు కాగలుగుతున్నారు. కలెక్టరేట్‌ అందుబాటులో ఉండటంతో భోజన సమయానికి పనులు పూర్తిచేసుకుని వారి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.

అందుబాటులో ఎస్పీ కార్యాలయం

ప్రజలకు ఏ కష్టం వచ్చిన శాంతి భద్రతలను విషయంలో పోలీసుల సాయం కోసం, ఏదైన సమస్య ఉంటే చెప్పుకోవడానికి, అలాగే స్పందనలో అర్జీలు పెట్టుకోవడానికి జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా అందుబాటులో ఉంది. అటు కలెక్టరేట్‌ ఇటు ఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ప్రజలు సులభంగా ఉపయోగించుకుంటున్నారు. జిల్లా కార్యాలయాలను తమకు అందుబాటులోకి తీసుకువచ్చిన మాజీ సీఎం జగన్‌ మేలును ప్రశంసిస్తున్నారు.

విపత్తుల వేళ వేగంగా సేవలు

జిల్లాలో ఏ ప్రాంతంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా వేగంగా అధికారులు వెళ్లి సాయం అందిస్తున్నారు. గోదావరి వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో కలెక్టర్‌, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు 30 నిమిషాల్లోపు సంఘటన ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు సకాలంలో సాయం చేయడం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. గ తంలో ఏలూరు నుంచి అధికారులు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. స్థానిక అధికారులు ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా ఉండేది.

కొత్త డివిజన్‌లు

నూతన జిల్లా ఏర్పాటుతో నూతన రెవెన్యూ, పోలీసు సబ్‌ డివిజన్లను కూడా నాటి ప్రభుత్వం ఏర్పాటు చే సింది. భీమవరం నూతన రెవెన్యూ డివిజన్‌, పో లీసు సబ్‌ డివిజన్‌, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌, పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఏర్పాటయ్యాయి.

భీమవరంలో కలెక్టరేట్‌

జిల్లా వివరాలు

జనాభా 20 లక్షలు ఓటర్లు 14.40 లక్షలు విస్తీర్ణం 2,278.35 చ.కి.మీ రెవెన్యూ డివిజన్‌లు 3 పోలీస్‌ సబ్‌ డివిజన్‌లు 3 మండలాలు 20 గ్రామాలు 409 మున్సిపాలిటీలు 6

జిల్లా అభివృద్ధికి జగన్‌ కృషి

రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుతో పాటు ఆయా జిల్లాల అభివృద్ధికి గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌ విశేషంగా కృషిచేశారు.

జిల్లాలో 71,200 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేసి గృహ నిర్మాణాలకు రూ.500 కోట్ల మేర ఖర్చు చేశారు.

రైతుల కోసం రూ.10.56 కోట్లతో మల్టీపర్సస్‌ గోడౌన్లు నిర్మాణం చేపట్టారు.

రూ 455.59 కోట్లతో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, రైతు భరోసా, విలేజ్‌ క్లినిక్‌లు నిర్మించారు.

రూ.16.14 కోట్లతో పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించారు.

రూ.86 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టారు.

రూ.9.72 కోట్లతో 60 అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించారు.

నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభు త్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు.

పట్టణాల్లో రూ.400 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ధి చేశారు.

పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు.

నరసాపురం ప్రాంతంలో రూ.3 వేల కోట్లతో ఆక్వా యునివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌, వాటర్‌ గ్రిడ్‌ తదితర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

జిల్లాల పునర్విభజనతో మేలు

పరిపాలనా సౌలభ్యం

ప్రజలకు చేరువలో జిల్లా అధికారులు

మూడేళ్లు నిండిన కొత్త జిల్లాలు

వ్యయప్రయాసలు తగ్గాయి

జిల్లాల పునర్విభజనతో వ్యయప్రయాసలు తగ్గాయి. గతంలో మా గ్రామం నుంచి జిల్లా కేంద్రం ఏలూరు వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు తప్పాయి. కేవలం 8 కిలోమీటర్లలో జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాం. స్పందన కార్యక్రమానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు చాలా వెసులుబాటుగా ఉంది. ఇదంతా జగన్‌ చేసిన మేలు

– బి.రాంబాబు, కొండేపూడి

జగన్‌ మేలు మరువలేం

భీమవరం జిల్లా కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేశారు. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులో ఉండటంతో సమస్యలను సులభంగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నాం. జిల్లా అధికారులు వేగంగా వచ్చి సమస్యలు పరిష్కరించగలుగుతున్నారు.

– వి.శ్రీనివాస్‌, తోకలపూడి

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ 1
1/3

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ 2
2/3

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ 3
3/3

నాలుగో వసంతంలోకి నవ పశి్చమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement