
భగవద్గీత పోటీలు ప్రారంభం
భీమవరం: భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనంద గీతా యజ్ఞం రాష్ట్రస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు శనివారం ప్రారంభించినట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలిపారు. రెండు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తారు.ఆనంద అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాల పోటీలను 4 విభాగాల్లో నిర్వహించారు. సబ్ జూనియర్స్ విభాగంలో 21 నుంచి 30 శ్లోకాలు, జూనియర్స్ 51 నుంచి 70 శ్లోకాలు, సీనియర్స్ 76 నుంచి 108 శ్లోకాలు, విశిష్ట ప్రతిభా విభాగం అన్ని వయసుల వారికి మొత్తం 108 శ్లోకాలపై పోటీలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. చైర్మన్ కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ గెలుపొందిన వారికి 13న ఆనందరాజు వర్ధంతి సభలో ప్రముఖుల సమక్షంలో బహుమతులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దాయన చంద్రజీ, కంతేటి వెంకటరాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.