ఆక్వాపై కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర | - | Sakshi
Sakshi News home page

ఆక్వాపై కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర

Apr 6 2025 12:42 AM | Updated on Apr 6 2025 12:42 AM

ఆక్వాపై కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర

ఆక్వాపై కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తణుకు అర్బన్‌: రొయ్య రేటు పతనమై ఆక్వా రైతులు విలవిల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనాలోచిత నిర్ణయాలతో ఆక్వా రైతులు రోడ్డున పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, ధరలు పతనమై రైతులు అల్లాడుతున్నారన్నారు. గతంలో టమాటా రైతుల మాదిరిగా రొయ్యలను రోడ్డున పారవేసే పరిస్థితులు రాకుండానే కూటమి ప్రభుత్వ ఎంపీలు పార్లమెంట్‌లో గళాన్ని వినిపించాలని సూచించారు. తక్షణమే రొయ్యల రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

10 నెలల్లో రూ.1.50 లక్షల కోట్ల అప్పు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా అన్యాయాలు, అక్రమాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని కారుమూరి విమర్శించారు. 10 నెలల్లో రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తానని గద్దెనెక్కి.. ఇప్పుడు ప్రజల తలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలు చెంపపెట్టు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు దారుణంగా ఉన్నాయని, ఇది మనకు మంచిది కాదంటూ కూటమి ఎమ్మెల్యే కొలికిపూడి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని కారుమూరి అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలని మనకు ఓట్లేశారే కానీ, జగన్‌ని తిట్టమని మనకు ప్రజలు ఓట్లేయలేదని గుర్తుంచుకోవాలని అనడం కూటమి ప్ర భుత్వ పనితీరును తెలుపుతుందని విమర్శించారు.

అమాత్యులకు రోజుకు రూ.1.50 లక్షలు..

తణుకులో పేకాట, గుండాట, క్రికెట్‌ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని, దీని కోసం అమాత్యుల కు రోజుకు రూ.1.50 లక్షలు ముట్టచెబుతున్నట్టుగా ప్రజలే చెప్పుకొంటున్నారని కారుమూరి విమర్శించారు. మద్యం దుకాణాల్లో పగలూ రాత్రీ అమ్మకాలు చేయిస్తూ పావలా వాటా, తాజాగా కమీషన్‌ గుంజుతున్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో మ ద్యం దుకాణాల వద్ద జరుగుతున్న దారుణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంపీపీ ఉప ఎన్నికల్లో అత్తిలిలోని తన ఇంటిని చుట్టుముట్టి ఎంపీటీసీ సభ్యులను ఎన్నికల కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకున్న తీరు దారుణమన్నారు. మద్యం అక్రమ అమ్మకాలకు సంబంధించి ఎకై ్సజ్‌ అధికారులకు 20 రోజులు స మయం ఇస్తున్నానని, తీరు మారకపోతే తామే రంగంలోకి దిగి నైట్‌ పాయింట్లు, బెల్టుషాపుల వద్దకు వెళ్లి అధికారులకు సమాచారం ఇస్తామని హెచ్చరించారు.

వక్ఫ్‌ బోర్డు బిల్లు దుర్మార్గం

సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మహిళా మాజీ డైరెక్టర్‌ మెహర్‌ అన్సారీ మాట్లాడుతూ వక్ఫ్‌ బోర్డు బిల్లుకు ముస్లింతా వ్యతిరేకంగా ఉన్నా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం దుర్మార్గమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement