
చిన్నారిపై వీధి కుక్క దాడి
నూజివీడు: మండలంలోని బత్తులవారిగూడెంలో ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. గ్రామానికి చెందిన కోలవంటి మధు కుమార్తె ఐశ్వర్య సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటిలో నుంచి బయటకు రాగా వీధి కుక్క మీదకు వచ్చింది. దీంతో పాప భయపడి కింద పడిపోగా ఆమె కంటి వద్ద, తలపై కరిచింది. బాలిక అరుపులు విని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు వచ్చి కుక్కను తోలేశారు. వెంటనే ఐశ్వర్యను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. గ్రామంలో కుక్కల సంచారం ఎక్కువైందని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.