
వక్‌్ఫ సవరణ బిల్లుపై మండిపాటు
నరసాపురం: ముస్లింల రక్షణకు విఘాతం కలిగించే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని నరసాపురం అంజుమన్ సంఘ అధ్యక్షుడు షేక్ బులిమస్తాన్ డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. పంజా సెంటర్ నుంచి ప్రకా శం రోడ్డు మీదుగా అంబేడ్కర్ సెంటర్ వరకూ ర్యా లీ సాగించి. అంబేడ్కర్ సెంటర్ వద్ద జరిగిన సభ లో బులిమస్తాన్ మాట్లాడుతూ ముస్లింల హక్కులను కాలరాసేలా వక్ఫ్ సవరణలకు కేంద్రం పూనుకుందన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. అంజుమన్ సంఘ నాయకులు దాపూద్ ఖాన్, షేక్ సిలార్‌సాహెబ్, ఎండీ మౌలాలీఖాన్, ఎండీ బాషాఖాన్, బడా వలీ, ఖాజీ ఇమ్రాన్ నాయకత్వం వహించారు.
ఆకివీడులో..
ఆకివీడు: వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని స్థానిక జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సెంటర్‌లో ధర్నా చేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, వైఎస్సార్‌సీపీ, ముస్లిం నాయకులు మాట్లాడుతూ చట్టంతో ముస్లింల మనోభావాలతో పాటు వారిని ఆర్థికంగా దెబ్బతీసినట్టు అవుతుందన్నారు. కొత్త చట్టాల వల్ల మైనార్టీలు భయంతో బతకాల్సి ఉంటుందన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఎండీ బిలాల్, సీపీఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, పెంకి అప్పారావు, బీవీ వర్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎండీ సిద్ధిక్, జక్కీ, మాబూ, సాహిజ్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ చట్ట సవరణ చట్టాన్ని నిలుపుదల చేయాలి
ఇరగవరం: వక్ఫ్ సవరణ బిల్లును నిలుపుదల చేయాలని ముస్లింలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేలంగిలో సీపీఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కామన మునిస్వామి మాట్లాడారు. ముస్లిం ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. గ్రామ శాఖ కార్యదర్శి ఇల్లంపాటి సత్యనారాయణ, కమిటీ సభ్యులు షేక్ బాబ్జి, షేక్ ఆలీబాబా, సల్మాన్, బాషా, పాన్ బీబీ తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లులో గర్జించిన ముస్లింలు
పాలకొల్లు సెంట్రల్: వక్ఫ్ సవరణ బిల్లును భేషరతుగా వెనక్కి తీసుకోవాలని నియోజకవర్గ ముస్లిం ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జానీ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో సున్ని జామియా మసీదు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జానీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి ముస్లిం మనోభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లా ఆస్తులను కాపాడి రాష్ట్రంలో వక్ఫ్ బిల్లు అమలు కాకుండా చూడాలన్నారు. షేక్ శిలార్, నజీర్, షేక్ మస్తాన్, మదీనా బీషా, రౌఫ్, బ్రాడీపేట మసీద్ ప్రెసిడెంట్ సల్మాన్ బాజీ, రామారావు పేట అధ్యక్షుడు షేక్ బాబాజీ, పూలపల్లి మసీదు అధ్యక్షుడు మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

వక్‌్ఫ సవరణ బిల్లుపై మండిపాటు

వక్‌్ఫ సవరణ బిల్లుపై మండిపాటు