
శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం సైతం కొనసాగింది. శనివారం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షేత్రానికి విచ్చేశారు. వీరికి తోడు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామికి మొక్కుబడులు సమర్పించారు. దాంతో కళ్యాణ కట్ట ప్రాంతం భక్తులతో పోటెత్తింది. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొల్టేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, చిన్న, పెద్ద తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గధుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, విరాళాలు ద్వారా మొత్తం రూ.83,057 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.
కృష్ణభారతి సేవలు అజరామరం
తాడేపల్లిగూడెం: స్వాతంత్య్ర సమరయోధురాలు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుమార్తె పసల కృష్ణభారతి సేవలు అజరామరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇటీవల దివంగతులైన కృష్ణభారతి సంస్మరణ సభ ఆదివారం కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. కృష్ణభారతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు పసల కనకసుందరరావు తదితరులు హాజరయ్యారు.

శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ

శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ