తొమ్మిది గంటలకే ఓపీ సేవలు | - | Sakshi
Sakshi News home page

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

Published Fri, Nov 22 2024 12:57 AM | Last Updated on Fri, Nov 22 2024 12:57 AM

తొమ్మ

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

నృసింహుడికి సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూలను, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు పంచామృతాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. అనంతరం స్వామి, అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన హోమం నిర్వహించారు. అలాగే నిత్యతిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

రుచి చూశాకే వడ్డించాలి

భువనగిరి : పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ముందుగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజన ఇంచార్జి ఎవరైనా ఒకరు రుచి చూడాలని, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వంట సామగ్రి, కూరగాయలను కూడా పరిశీలించాలన్నారు. ఈ విధానాన్ని ప్రతి రోజూ పాటించాలని స్పష్టం చేశారు. ఎంఈఓలు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని సూచించారు. మోడల్‌ స్కూళ్లు, కాంప్లెక్స్‌ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యేకాధికారులు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆంథోళ్‌ మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని ఆంథోళ్‌ మైసమ్మ ఆలయ హుండీలో భక్తులు సమర్పించి నగదు, ఇతర కానుకలను గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. నాలుగు నెలల 20 రోజులకు గాను రూ.14,96,475 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈఓ మోహన్‌బాబు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. దేవాదాయ శాఖ పరిశీలకులు ఏడుకొండలు సమక్షంలో హుండీలను లెక్కించారు.

భువనగిరి చెరువులో చెత్త తొలగింపు

భువనగిరిటౌన్‌ : భువనగిరి పెద్ద చెరువులో చెత్త, వ్యర్థాలు పడేస్తుండడంతో నీరు కలుషి తం అవుతున్న నేపథ్యంలో ‘డంపింగ్‌ యార్డులా పెద్ద చెరువు’ శీర్షికతో ఈనెల 20 న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం మున్సిపల్‌ అధికారులు చెరువును సందర్శించి పారిశుద్ధ్య సిబ్బందితో చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన సాక్షి దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

పీఆర్‌ ఏఈకి షోకాజ్‌ నోటీస్‌

భువనగిరి టౌన్‌ : పంచాయతీరాజ్‌ ఈఈలు, డీఈలు, ఏఈలతో కలెక్టర్‌ హనుమంతరావు గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో పురోగతి లేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాజాపేట మండల ఏఈకి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు.

ఉత్సవమూర్తులకు హారతినిస్తున్న అర్చకుడు

భువనగిరి : వైద్యులు సకాలంలో రాకపోవడం, వచ్చినా పూర్తి సమయం విధుల్లో ఉండకపోవడం, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విజిట్‌లో గుర్తించిన కలెక్టర్‌.. మార్పునకు శ్రీకారం చుట్టారు. వైద్యులు నిర్దేశిత సమయానికి అందుబాటులో ఉంటే రోగులకు చాలా వరకు స్థానికంగానే వైద్యసేవలు అందుతాయని భావించారు.అందులో భాగంగా ఉదయం 9గంటలకే ఓపీ సేవలు ప్రారంభించాలని వైద్యాధి కారులు, వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 21వ తేదీనుంచి కలెక్టర్‌ ఆదేశాలు అమల్లోకి వచ్చా యి. మొదటి రోజు పలువురు డాక్టర్లు 9 గంటలలోపే విధులకు హాజరై రోగులకు సేవలందించారు.

వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా పర్యవేక్షణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు, వైద్యులు, కలెక్టర్‌తో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు ఏర్పాటు చేశారు. వైద్యులు ఉదయం 9 గంటలకు పీహెచ్‌సీలకు రాగానే ఫొటో దిగి గ్రూపులో పోస్టు చేయాలి. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. తద్వారా సేవల్లో పారదర్శకత పెరగ నుంది. సకాలంలో ఓపీ సేవలు అందడం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య పెరగనుంది. అంతేకాకుండా ప్రతి చిన్న జబ్బుకు రోగులు పట్టణ, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు వెళ్లే బాధలు తప్పనున్నాయి.

21 పీహెచ్‌సీలు

జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దాదాపు అన్ని చోట్ల వైద్యులు సమయపాలన పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి. క్షేత్రస్థా యిలో అందుబాటులో ఉండకపోవడంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఇకనుంచి ఉద యం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉంది.

న్యూస్‌రీల్‌

నేడు మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి రాక

యాదగిరిగుట్ట : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం యాదగిరిగుట్టకు రానున్నారు. ఆలేరు, భువనగిరి డివిజన్లకు మల్లన్నసాగర్‌నుంచి తాగునీరు అందించే మిషన్‌ భగీరథ పనులకు సంబంధించి యాదగిరిగుట్ట కొండకు దిగువన ఏర్పాటు చేస్తున్న పైలాన్‌ను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మిషన్‌ భగీరథ అధికారులు పరిశీలించారు. మంత్రులతో పాటు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి రానున్నారు.

పీహెచ్‌సీలపై కలెక్టర్‌ ఫోకస్‌

ఫ రోగులకు మెరుగైన సేవలు

అందేలా చర్యలు

ఫ వైద్యాధికారులు, వైద్యులతో ప్రత్యేకంగావాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు

ఫ డాక్టర్‌ విధులకు రాగానే ఫొటో దిగి గ్రూప్‌లో పోస్టు చేయాలన్న నిబంధన

ఫ గురువారం నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాలు

వైద్యసేవలు మెరుగుపడుతాయి

కలెక్టర్‌ ఆదేశాల మేరకు పీహెచ్‌సీ వైద్యులు రోజూ ఉదయం 9గంటలకే విధులకు హాజరై ఓపీ సేవలు ప్రారంభించాలి. సకాలంలో విధులకు హాజరైనట్లు ఫొటో తీసి వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేయాల్సి ఉంటుంది. గ్రూపులో పోస్టు చేసిన ఫొటోలను కలెక్టర్‌ పరిశీలిస్తారు. పీహెచ్‌సీల్లో ఉదయం 9 గంటల నుంచే ఓపీ సేవలు అందించడం వల్ల గ్రామీణ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే పీహెచ్‌సీల్లో సాధారణ కాన్పులు పెంచాలని కలెక్టర్‌ సూచించారు. ఆ మేరకు డాక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. –డాక్టర్‌ మనోహర్‌, డీఎంహెచ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment
తొమ్మిది గంటలకే ఓపీ సేవలు1
1/7

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు2
2/7

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు3
3/7

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు4
4/7

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు5
5/7

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు6
6/7

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు7
7/7

తొమ్మిది గంటలకే ఓపీ సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement