
నామినేషన్లకు మిగిలింది ఒక్కరోజే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ముగింపు దశకు చేరుకున్నాయి. నామినేషన్లు వేసేందుకు ఒక్కరోజే గడువు ఉంది. ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, ఈనెల 10వ తేదీతో ముగియనుంది. 8, 9తేదీల్లో రెండో శని, ఆది వా రం కావడంతో నామినేషన్లు స్వీకరించరు. 10వ తేదీ ఒక్కరోజే నామినేషన్ల వేసేందుకు సమయం ఉంది.
శుక్రవారం అత్యధిక నామినేషన్లు
నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 17 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 13 మంది 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్సీ, టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్‌టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తంరెడ్డి, టీచర్స్ జేఏసీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎస్.సుందర్‌రాజ్, ఏలె చంద్రమోహన్, దామెర బాబురావు, తలకొప్పుల పురుషోత్తంరెడ్డి, డాక్టర్ పోలిపాక వెంకటస్వామి, చాలిక చంద్రశేఖర్, కంటె సాయన్న, జంగిటి కై లాసం నామినేషన్లు దాఖలు చేశారు.
11న పరిశీలన
ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా, 11న పరిశీలన ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
10వ తేదీతో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు
సెలవు కావడంతో నేడు, రేపు విరామం
11న నామినేషన్ల పరిశీలన
శుక్రవారం నామినేషన్లు వేసిన
ప్రధాన సంఘాల అభ్యర్థులు
ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు
ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం నల్లగొండ పట్టణంలో ర్యాలీలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఇక 10వ తేదీన పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment