● నిత్యావసర సరుకులు, దుస్తులు అందజేసిన కలెక్టర్
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని కంకణాలగూడెం గ్రామ పంచాయతీ పరిధి దేశ్యతండాకు చెందిన పదో తరగతి విద్యార్థి దేవరకొండ భరత్‌చంద్రాచారి కుటుంబానికి కలెక్టర్ హనుమంతరావు చేయూతనిచ్చారు. రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపగా.. పంచాయతీ కార్యదర్శి సుభాష్ శుక్రవారం రాత్రి వారికి అందజేశారు. అదే విధంగా భరత్‌చంద్రాచారి, అతని చెల్లలు వైష్ణవికి మూడ జతల దుస్తులు, బూట్లు అందజేశారు. భరత్‌చంద్రాచారి కుటుంబానికి మున్ముందు కూడా తనవంతు సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్‌కు భరత్‌చంద్రాచారి కుంటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకోసం ‘తలుపు తట్టి.. నిద్రలేపి’ కార్యక్రమానికి కలెక్టర్ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భరత్ చంద్రాచారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మార్మోగిన శివనామస్మరణ
చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుం డాల మహోత్సవం నిర్వహించారు.
- 8లో
Comments
Please login to add a commentAdd a comment