
త్రిషలా.. మేమూ ఆడతాం..
భారత మహిళా క్రికెట్ జట్టు అండర్–19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడిని ఆదర్శంగా తీసుకుని పలువురు అమ్మాయిలు క్రికెట్ సాధన చేస్తున్నారు. ఆటలపై ఆసక్తి ఉన్న కూతుళ్లను తల్లిదండ్రులు క్రికెట్ వైపు ప్రోత్సహించినప్పుడే.. త్రిష, కమలిని, సనిక చాల్కె, వైష్ణవి శర్మ తరహాలో తయారవుతారు. ప్రస్తుతం సూర్యాపేట, కోదాడలోని క్రికెట్ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు
ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అవకాశం వస్తే భారత జట్టుకు, మహిళల ఐపీఎల్‌కు ఎంపికై సత్తా చాటుతామని చెబుతున్నారు.
– సూర్యాపేట టౌన్, కోదాడరూరల్
ఫ మన వాళ్లలోనూ అండర్–19 మహిళల
ప్రపంచకప్ గెలుపు స్ఫూర్తి
ఫ క్రికెట్‌పై మక్కువతో కోచింగ్ తీసుకుంటున్న బాలికలు
ఫ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే
లక్ష్యమంటున్న అమ్మాయిలు
భారత జట్టుకు ఎంపికవుతా..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన అక్షయ 10వ తరగతి చదువుతోంది. క్రికెట్‌పై మక్కువతో సూర్యాపేటలోని ఎస్వీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్రతిభ చాటుతోంది. 2024లో భద్రాచలంలో అండర్–17 ఎస్‌జీఎఫ్ స్టేట్‌మీట్‌లో ఆడి సత్తా చాటింది. ఈ ఏడాది ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి స్టేట్‌మీట్‌లో పాల్గొంది. ఈ ఏడాది జరగనున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) లీడ్ మ్యాచ్‌లో ఆడనున్నట్లు అక్షయ తెలిపింది. భారత జట్టుకు ఎంపిక కావడమే తన లక్ష్యమని అక్షయ పేర్కొంది.
ఆల్ రౌండర్‌గా రాణిస్తా..
సూర్యాపేటకు చెందిన క్రికెట్ కోచ్ వాంకుడోతు సుధాకర్, రేణుక దంపతుల కూతురు కారుణ్యశ్రీ 5వ తరగతి చదువుతోంది. కారుణ్యశ్రీ తన తండ్రి పోత్సాహంతో చిన్ననాటి నుంచే బ్యాట్ పట్టింది. ఈ ఏడాది ఖమ్మంలో జరిగిన అండర్–17 స్టేట్‌మీట్‌లో ఆడి ఆల్ రౌండర్‌గా ప్రతిభ కనబరిచింది. త్వరలో జరగనున్న హెచ్‌సీఏ లీగ్స్ ఆడటానికి వెళ్లనున్నట్లు కోచ్ సుధాకర్ తెలిపారు. భవిష్యత్‌లో భారత జట్టుకు ఎంపికై ఫాస్ట్ బౌలర్‌గా ఆడటమే తన లక్ష్యమని చెబుతోంది.
సూర్యాపేటలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలు
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం
కోదాడ మండలం గుడిబండకు చెందిన లాస్యశ్రీ 9వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది జనవరిలో ఖమ్మం నగరంలో నిర్వహించిన స్కూల్ గేమ్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) క్రీడల్లో పాల్గొంది. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించింది. క్రికెట్‌లో రాణించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెబుతోంది లాస్యశ్రీ.
సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ బాలునాయక్ కూతురు యోధ క్రికెట్‌లో రాణించేందుకు ప్రాక్టీస్ చేస్తోంది. యోధ ప్రస్తుతం 2వ తరగతి చదువుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది. త్వరలో లీగ్ మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది యోధ. నాన్న బాలునాయక్ ప్రోత్సాహంతో క్రికెట్ నేర్చుకుంటున్నానని..క్రికెటర్ శృతిమందన ఆడతానని చెబుతోంది.
దేశం తరఫున ఆడిన అరుంధతి
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : మారుమూల గ్రామంలోనే జన్మించినప్పటికీ తనలో ఉన్న ప్రతిభతో జాతీయస్థాయిలో తనదైన ముద్రవేసుకుంది తిరుమలగిరి(సాగర్)కు చెందిన అరుంధతిరెడ్డి. మహిళల క్రికెట్‌లో రాణిస్తూ.. ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. 2018లో ఐసీసీ మహిళా ఛాంపియన్ షిప్ భారత్ –శ్రీలంక టీ–20లో ఆమె దేశం తరఫున అరంగేట్రం చేసింది. ఎడమచేతి వాటం బౌలింగ్ చేస్తూ అటు బ్యాటింగ్‌లోనూ ప్రతిభ చూపి ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్–16 జట్టుకు కెప్టెన్‌గా, అండర్ – 17, అండర్– 19, అండర్– 23 జట్లలో ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. భారతీయ రైల్వేలో గ్రూప్–సీ ఉద్యోగిగా చేరి రైల్వే జట్టు తరుఫున క్రికెట్ ఆడుతోంది. తండ్రి శాగం వెంకట్‌రెడ్డి కూడా రైల్వే ఉద్యోగి కావడం గమనార్హం.
డబ్ల్యూసీఎల్ జట్టుకు ఎంపిక
హుజూర్‌నగర్‌కు చెందిన పచ్చిపాల మహేశ్వరి డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. రోజూ కోదాడ వచ్చి కోచ్ సిద్ధిఖ్ వద్ద క్రికెట్‌లో శిక్షణ పొందుతోంది. తండ్రి హుజూర్‌నగర్‌లో టీ స్టాల్ నడుపుతుండగా తల్లి గృహిణి. 2024 జూలైలో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ఉమెన్ క్రికెట్ లీగ్‌లో సెలక్షన్స్‌లో పాల్గొని అండర్–19 హైదరాబాద్ డబ్ల్యూసీఎల్ జట్టుకు ఎంపికై ంది. క్రికెట్‌లో మరింత సాధన చేసి భారత జట్టు తరఫున ఆడి పుట్టిన నేలకు మంచి పేరు తెస్తానంటోంది మహేశ్వరి.
చిచ్చర పిడుగు యోధ..
- 8లో

త్రిషలా.. మేమూ ఆడతాం..

త్రిషలా.. మేమూ ఆడతాం..

త్రిషలా.. మేమూ ఆడతాం..

త్రిషలా.. మేమూ ఆడతాం..

త్రిషలా.. మేమూ ఆడతాం..

త్రిషలా.. మేమూ ఆడతాం..

త్రిషలా.. మేమూ ఆడతాం..
Comments
Please login to add a commentAdd a comment