
అన్నదాత.. స్ఫూర్తిప్రదాత
మోత్కూరు మున్సిపాలిటీ పరిధి ఆరెగూడేనికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి (45) బంక్‌లో పెట్రోలు పోయించుకుంటూ కుప్పకూలిపోయాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేనికి తరలించగా.. నర్సిరెడ్డికి బ్రెయి న్‌డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డాక్టర్ల సలహామేరకు నర్సిరెడ్డి అవయవాలను దానం చేసేందుకు మృతుడి భార్య, కుటుంబీకులు సమ్మతించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరం కావడంతో నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. నర్సిరెడ్డి నుంచి గుండెను సేకరించి నాగోల్ మెట్రో రైలు ద్వారా జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. గుండెతో పాటు మరికొన్ని అవయవాలు సేకరించారు. మతుడి భార్య నిర్మల, పదేళ్ల వయస్సున్న కుమారులు శశిధర్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డిని ఐపీఎస్ అధికారి సజ్జనార్ పరామర్శించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment