
No Headline
సాక్షి, యాదాద్రి : అవయవ దానం చేయడం ద్వారా తాము చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వివిధ కారణాలతో చావుకు దగ్గరైన వారి అవయవాలన దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకువస్తున్నారు. డాక్ట ర్లు, జీవన్‌దాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా అవయవదానంపై అవ గాహన పెరుగుతోంది. ఏడాదిలో ఎనిమిది బ్రెయిన్‌డెడ్ ఘటనలు చోటు చేసుకోగా మృతుల నుంచి సేకరించిన అవయవాల ద్వారా 21 మందికి పునర్మజన్మ కలిగింది.
అవయవ దాతలు
● భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లి రేషన్‌డీలర్ చేపూరి లక్ష్మయ్యచారి(55) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దాంతో కుటుంబ సభ్యులు లక్ష్మయ్య చారి అవయవాలను జీవన్‌ధాన్‌కు దానం చేశారు. దీంతో ప్రాణాపాయంలో ఉన్న మరో నలుగురి ప్రాణాలు దక్కాయి.
● పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దేవరపల్లి మోహన్‌రెడ్డి(42) రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ తో మృతిచెందాడు. అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఐదుగురికి ప్రాణాలు నిలిపారు.
● భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన గుండ్ల ఎల్లారెడ్డి(68) శనివారం భువనగిరి పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. వైద్యుల సూచన మేరకు ఎల్లారెడ్డి కళ్లను హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు అప్పగించారు.
● వలిగొండ మండలం కంచెనపల్లికి చెందిన మెరుగు అంజయ్య బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. వైద్యుల సూచన మేరకు అతని అవయవాలను దానం చేశారు.
ఆరుగురి జీవితాల్లో వెలుగులు
ఆలేరు మున్సిపాలిటీ బహుదూర్‌పేటకు చెందిన జంపాల సుజాత(40) ఇంట్లో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయారు. వెంటనే ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూనే బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఆమె భర్త జంపాల దశరథ, కుటుంబసభ్యుల అంగీకారంతో జీవన్‌దాన్ బృందం ఆమె నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తుల, రెండు కంటి కార్నియాలు సేకరించి అవసరం ఉన్న వారికి అమర్చారు. అవయవ దానంతో మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా బాధ నుంచి ఉపశమనం కలిగిందని దశరథ చెప్పారు.
ఫ అవయవదానంపై
పెరుగుతున్న అవగాహన
ఫ వైద్యులు, జీవన్‌దాన్ సభ్యుల సూచనతో ముందుకొస్త్తున్న కుటుంబాలు

No Headline
Comments
Please login to add a commentAdd a comment