
భువనగిరి కేంద్రమే ఆధారం!
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితి దాపురించింది. గతంలో గుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రం నడిచేది. చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో మూసివేశారు. ఏడాది గడిచినా తిరిగి ప్రారంభించడం లేదు. దీంతో స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే..
ఆధార్ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. ప్రస్తుతం ఏ పనికావాలన్నా ఆధార్ ఉండాల్సిందే.. అది లేకపోతే పని జరగడం లేదు.. పోనీ ఆధార్ చేయించుకుందామంటే ఆ అవకాశమూ లేదు. ఎందుకంటే గుట్టలో ఉన్న ఒకే ఒక్క ఆధార్ కేంద్రం మూతపడింది. దీంతో ఆధార్ చేర్పులు, మార్పులకు అష్టకష్టాలు పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలంలో 23 గ్రామాలు 75 వేల వరకు జనాభా ఉంది. ఏ ఒక్క గ్రామంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయలేదు. కార్డుల్లో తప్పుల సవరణ, చేర్పులు, మార్పులు చేసుకోవడానికి భువనగిరికి వెళ్లాల్సి వస్తుంది. అంతదూరం వెళ్లినా సర్వర్‌లో సాంకేతిక సమస్యలు, రద్దీ తదితర కారణాలతో పొద్దస్తమానం ఎదురుచూడాల్సి వస్తుంది.
ఆధార్ సేవలకు ఏడాది నుంచి యాదగిరిగుట్ట ప్రజలు దూరం
గతంలో ఉన్న కేంద్రం మూసివేత
కొత్త కార్డులు, చేర్పులు,
మార్పులకు అష్టకష్టాలు
Comments
Please login to add a commentAdd a comment