
యాసంగిలో భారీగా ధాన్యం దిగుబడి
సాక్షి,యాదాద్రి : యాసంగి సీజన్‌లో ధాన్యం దిగుబడి భారీగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. శనివారం తన చాంబర్‌లో సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమైన యాసంగి ధాన్యం దిగుబడి, సేకరణ లక్ష్యం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో సుమారు 2,75,000 ఎకరాల్లో వరి సాగు అయ్యిందని, 7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. అందులో 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
సీఎంఆర్ సరఫరాలో వేగం పెంచండి
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సమయం దగ్గర పడుతుందని, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో వేగం పెంచాలని మిల్లర్లకు సూచించారు. ఆ విధంగా అయితేనే మిల్లుల్లో ఖాళీ స్థలం ఏర్పడి ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం నిల్వ చేయడానికి అవసరం మేరకు స్థలాలను అద్దెకు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, సంబంధిత అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.
ఫ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి
వచ్చే అవకాశం
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment