సాక్షి, యాదాద్రి : ప్రాదేశిక సమరానికి యంత్రాంగం సమాయత్తమవుతోంది. షెడ్యూల్ ఏ క్షణంలో వచ్చినా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా సన్నద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితర ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈనెల 15వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తయ్యేలా కసరత్తు చేస్తోంది. జిల్లాలో 17 జెడ్పీటీసీ, 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కొత్తగా మోత్కూరు మండలంలో పాటిమట్ల ఎంపీటీసీ స్థానం ఏర్పాటైంది. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 178కి చేరింది.
నేడు పోలింగ్ సిబ్బంది ఖరారు
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం రిటర్నింగ్ అధికారులు(ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ (పీఓ)సిబ్బందిని ఖరారు చేయనున్నారు. 12న ఆర్‌ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 13 లేదా 14న పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇవ్వనున్నారు.వీరికి టీవోటీ (ట్రైనర్స్ ఆఫ్ ట్రైనీస్) లు, మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు
గుర్తులు ప్రకటించిన ఎన్నికల కమిషన్
జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్‌తో పాటుగా ఇండిపెండెంట్ల కోసం మరో 30 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. 30 గుర్తుల్లో ఇండిపెండెంట్‌లు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరికంటే ఎక్కువ మంది ఎంచుకుంటే డ్రా విధానంలో కేటాయిస్తారు.
జాతీయ, ప్రాంతీయ పార్టీలకు..
కాంగ్రెస్‌కు చేయి, బీజేపీకి కమలం పువ్వు, సీపీఎం సుత్తి కొడవలి నక్షత్రం, ఆమ్ ఆద్మీ చీపురు, బీఆర్‌ఎస్ కారు, వైఎస్సార్‌సీపీ ఫ్యాన్, ఎంఐఎం పతంగి, టీడీపీ సైకిల్, సీపీఐ కంకి కొడవలి, జనసేన గాజు గ్లాసు, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తులు వచ్చాయి.
ఇండిపెండెంట్లకు .. స్వతంత్ర అభ్యర్థులకు
కెమెరా, క్యారంబోర్డు, చపాతీ రోలర్, కోటు, పండ్ల బుట్ట, ఎయిర్ కండీషనర్, ఆపిల్ పండు, బెల్ట్, బైనాక్యులర్, ఫుట్‌బాల్ ఆటగాడితో పాటు మరో 21 ఫ్రీ సింబల్స్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.
స్వయంగా పరిశీలించనున్న అధికారులు
పోలింగ్ కేంద్రాల తుది జాబితాను 15వ తేదీన ప్రకటిస్తారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉన్నాయో లేదో.. మండల స్థాయి అధికారులు స్వయంగా పరిశీలిస్తారు.
ఈ తేదీల్లో ఇవీ..
పోలింగ్ కేంద్రాల ముసాయిదాను 11వ తేదీన ప్రకటించనున్నారు. 11నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి 14న పరి ష్కరించనున్నారు. అదే రోజు కలెక్టర్ పరిశీ లించి ఆమోదిస్తారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను15వ తేదీ విడుదల చేస్తారు. అదే విధంగా 13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండలాల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు.
పరిషత్ ఎన్నికలకు యంత్రాంగం సమాయత్తం
15వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 178 ఎంపీటీసీ,
17 జెడ్పీటీసీ స్థానాలు
కొత్తగా పాటిమట్ల ఎంపీటీసీ ఏర్పాటు
ఇప్పటికే గుర్తులు కేటాయించిన
ఎన్నికల కమిషన్
మోత్కూరు మండలంలో పెరిగిన ఎంపీటీసీ స్థానాలు
మోత్కూరు : మండలంలో ఎంపీటీసీ స్థానాలు ఐదుకు పెరగనున్నాయి. ప్రస్తుతం నాలుగు ఎంపీటీసీలు ఉండగా కొత్తగా పాటిమట్ల ఎంపీటీసీ స్థానం ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీ సమావేశాల్లో పలు సవరణలు చేసి ఆమోదించింది. దీని ప్రకారం ప్రతి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి. ఈ నేపథ్యంలో ఐదు కంటే తక్కువ స్థానాలు ఉన్న మండలాల వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఇందులో భాగంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలున్న మోత్కూరు మండలంలో ఐదవ ఎంపీటీసీ స్థానం ఏర్పాటుకు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఎంపీటీసీ స్థానాలు ఇవీ
దాచారం ఎంపీటీసీ
పాటిమట్ల పరిధిలో సదర్శాపురం
దత్తప్పగూడెం పరిధిలో
దత్తప్పగూడెం, పాలడుగు గ్రామాలు
ముశిపట్ల పరిధిలో ముశిపట్ల, పనకబండ, రాగిబావి
పొడిచేడు ఎంపీటీసీ పరిధిలో పొడిచేడు, అనాజిపురం
కొత్తగా పాటిమట్ల ఏర్పాటైంది.
Comments
Please login to add a commentAdd a comment