నార్కట్‌పల్లి : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజ న మంత్ర పుష్ప పూజలను నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉంచి.. చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నవీన్‌కుమార్, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, నేతగాని కృష్ణ, వారాల రమే్‌ష్, రేగట్టె నవీన్‌రెడ్డి, గడుసు శశిధర్‌రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య, రాజ్యలక్ష్మి, వంశీధర్‌రావు, నరేష్, గణేష్, మహేందర్‌రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment