చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ ఎస్‌ఐ ఎం.లక్ష్మ య్యపై అవినీతి ఆరోపణలు రావడంతో మల్టీజోన్ ఐజీ–2 కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఏడాది క్రితం చౌటుప్పల్ ఎస్‌ఐగా విధుల్లో చేరిన లక్ష్మయ్యపై మొదటి నుంచి అవినీతి ఆరోపణలు వచ్చాయి. నాలుగు నెలల క్రితం చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ సీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కానీ ఆయన అక్కడ విధుల్లో చేకుండా చౌటుప్పల్‌లోనే కొనసాగారు. ఇటీవల ఓ పోర్జరీ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఎస్‌ఐ లక్ష్మయ్యను చౌటుప్పల్ ఏసీపీ పంపించారు. అయితే ఆ వ్యక్తికి ముందస్తు సమాచారం ఇచ్చి పరారయ్యేలా సహకరించాడని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా రెడ్డిబాయి స్టేజీ వద్ద ఉన్న ఓ దాబాలో మద్యం అమ్ముతున్నారని సమాచారం ఇచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో సదరు వ్యక్తులు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన వ్యక్తుల నుంచి లంచాలు తీసుకోవడంతో ఓవ్యక్తి కూడా సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మయ్యపై శాఖాపరమైన విచారణ జరిపి మల్టీజోన్–2 ఐజీ కార్యాలయానికి ఈ నెల 5వ తేదీన అటాచ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment