
ఇసుక లారీల ‘ఓవర్’ లోడ్
సాక్షి,యాదాద్రి : ఓవర్‌లోడ్ ఇసుక రవాణా అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది. ఓవర్‌లోడ్ కారణంగా రోడ్లు, వంతెనలు దెబ్బతింటున్నాయి. ములుగు జిల్లా భూపాలపల్లి పరిసర క్వారీల నుంచి హైదరాబాద్‌కు ఓవర్‌లోడ్‌తో యాదాద్రిభువనగిరి జిల్లా మీదుగా ఇసుకను తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టి జరిమానాలు విఽధిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. జిల్లా మీదుగా సుమారు 500 ఇసుక లారీలు నిత్యం నడుస్తున్నాయి.
గోదావరి నది ఇసుక రీచ్‌ల నుంచి..
టీజీఎండీసీ గోదావరి నది ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా మేడ్చల్ మల్కాజిగిరి మీదుగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు గోదావరి ఇసుకను రవాణా చేస్తున్నారు.
దెబ్బతింటున్న రోడ్లు
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీల కారణంగా జాతీయ రహదారి దెబ్బతింటోంది. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న మెజార్టీ ఇసుక లారీల వల్ల జనగామ నుంచి ఆలేరు, వంగపల్లి, రాయిగిరి, భువనగిరి, బీబీనగర్, మీదుగా ఘట్‌కేసర్ వరకు 40 కిలోమీటర్ల రోడ్డు పలుచోట్ల దెబ్బతిన్నది.
తనిఖీలు చేస్తున్నా తప్పించుకుని..
వరంగల్–హైదరాబాద్, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులపై అధికారులు తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలోని పంతంగి, గూడూరు టోల్‌గేట్‌ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. విషయం తెలుసుకుని జాతీయ రహదారి వెంట లారీలు గంటల తరబడి నిలిపి ఉంచుతున్నారు. అధికారులు వెళ్లగానే లారీలు తరలిపోతున్నాయి. అక్రమ రవాణా వెనుక కొందరు అధికారుల సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
నేడు సీఎస్ సమీక్ష
ఓవర్‌లోడ్‌తో ఇసుక అక్రమ రవాణాపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం. అక్రమ ఇసుక రవాణా వివరాలను జిల్లా ఇంటలిజెన్స్ అధికారులు సేకరించారు. జిల్లాలోని బిక్కేరు, ఆలేరు, మూసీతోపాటు స్థానిక వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణ, ఫిల్టర్ ఇసుక రవాణా వివరాలను సేకరించారు. బస్వాపూర్ ప్రా జెక్టు నిర్మాణానికి అనుమతి తీసుకుని ఇతర జిల్లాలకు తరలిస్తున్న ఇసుక రవాణాపై ఆరా తీశారు.
ఇసుక లారీల రవాణా నిబంధనలు
టైర్ల లారీ ప్రస్తుతం కొన్ని
ఉండాల్సిన బరువు లారీలు ఇలా
12 టైర్ల లారీ 35 టన్నులు 50 టన్నులు
14 టైర్ల లారీ 42.50 60 టన్నులు
16 టైర్ల లారీ 47.50 70 టన్నులు
అక్రమ రవాణాపై ఇంటలిజెన్స్ ఆరా
నేడు సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
నివేదిక సిద్ధం చేసిన కలెక్టర్
జరిమానా విధిస్తున్నాం
ఇసుక ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలను తనిఖీ చేస్తున్నాం. కెపాసిటీకి మించి ఇసుకతో వస్తున్న లారీలకు జరిమానా విధిస్తున్నాం. అధిక లోడ్‌తో వస్తున్న లారీకి రూ.2 వేలు, ప్రతి టన్నుకు రూ1000 జరిమానా విధిస్తున్నాం. కొన్నిమార్లు డ్రైవర్ల లైసెన్స్‌లు సస్పెండ్ లేదా రద్దు చేస్తున్నాం.
– సాయికృష్ణ, ఇన్‌చార్జ్ డీటీఓ భువనగిరి

ఇసుక లారీల ‘ఓవర్’ లోడ్
Comments
Please login to add a commentAdd a comment