
ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు నమ్మొద్దు
వలిగొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 14 మాసాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. ప్రస్తుతం రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేయడానికి సన్నాహాలు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ త్రిశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ చైర్మెన్ భీమానాయక్, పాశం సత్తిరెడ్డి, చిట్టెడి జనార్దన్‌రెడ్డి, నూతి రమేష్, తుమ్మల యుగంధర్‌రెడ్డి, బాబురావు, బాతరాజు బాల్ నర్సింహ, బెలిద నాగేశ్వర్, సామ రాంరెడ్డి, బద్దం సంజీవరెడ్డి, కంకల కిష్టయ్య, చిలుగురి సత్తిరెడ్డి, బత్తిని లింగయ్య, సహదేవ, పల్లెర్ల సుధాకర్ పాల్గొన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment