
ధాన్యం సేకరణకు సన్నాహాలు చేయాలి
సాక్షి,యాదాద్రి : యాసంగి సీజన్‌లో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచే ధాన్యం సేకరణకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. యాసంగి 2024–25 కు సంబంధించి ధాన్యం సేకరణపై సన్నాహక సమావేశం మంగళవారం రాయగిరిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ధాన్యం సేకరణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏజెన్సీలు, అధికారులు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రానున్న యాసంగి సీజన్‌లో గత సీజన్ కంటే రెట్టింపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నందున దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 395 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి సాయికృష్ణ, జిల్లా కోఆపరేటీవ్ అధికారి రవీందర్, సహాయ పౌర సరఫరాల అధికారిని రోజా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment